Skip to main content
నవ తరంగాలుSearch
జిల్లా వార్తలుహనుమకొండ

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయి విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే విఘ్నేశ్వరుని అనుగ్రహంతో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయి ఆకాంక్షించారు.

By: DHARAVATH ASHOK · హనుమకొండ·1 min read
Share:
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయి. విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే విఘ్నేశ్వరుని అనుగ్రహంతో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని కోరారు. సోమవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ తెలిపారు.

Related news

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
జిల్లా వార్తలు

ఎగ్జామినేషన్‌ కేంద్రంను పరిశీలించిన కలెక్టర్

పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న జరగనున్న కంబైన్డ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ కేంద్రంను పరిశీలించిన కలెక్టర్ ఈ నెల 13వ తేదీన( ఆదివారం) జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ -2 పరీక్ష నిర్వహణకు పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. బుధవారం హనుమకొండ వడ్డేపల్లి లోని పింగిళి ప్రభుత్వ బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

రెడ్ క్రాస్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం
జిల్లా వార్తలు

రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను అక్టోబర్ 4వ తేదీన నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో హనుమకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి సంబంధించిన ఎన్నికల నిర్వహణ అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇతర అధికారులతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.

అదనపు కలెక్టర్ హనుమకొండ
జిల్లా వార్తలు

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందుస్తుగానే సిద్ధం చేయాలి

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి జిల్లాలో రానున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందుస్తుగానే సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాలు, డిఆర్డిఏ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖ అధికారులతో కలిసి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పిఎసిఎస్ ల సీఈవోలు, ఏపీఎంలతో సమావేశాన్ని నిర్వహించారు.