బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నవ తరంగాలు / హనుమకొండ : పాలకుర్తి గురుకులంలో విద్యార్థినులను కరిచిన ఎలుకలు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. USFI జనగామ జిల్లా కార్యదర్శి యాకన్న రాథోడ్ డిమాండ్.

నవ తరంగాలు / హనుమకొండ : పాలకుర్తి గురుకులంలో విద్యార్థినులను కరిచిన ఎలుకలు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. USFI జనగామ జిల్లా కార్యదర్శి యాకన్న రాథోడ్ డిమాండ్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థినుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థినులను ఎలుకలు కరవడంతో పలువురు బాలికలు గాయపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బాధిత విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనపై USFI జనగామ జిల్లా కార్యదర్శి యాకన్న రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం, పరిశుభ్రమైన వసతి, సరైన ఆహారం, వైద్య భద్రత కల్పించాల్సిన గురుకులంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అత్యంత ఆందోళనకరమని అన్నారు.
Related news

సామాన్య ప్రజలపై మోయలేని భారాలు
నవ తరంగాలు / హనుమకొండ : క్యాష్ లెస్ పేరుతో యూస్ లెస్ పనులు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం. యూపిఐ ఛార్జీల పేరుతో సామాన్య ప్రజలపై మోయలేని భారాలు. ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం. దేశంలో సామాన్య ప్రజలు, యువత, విద్యార్థులు, కార్మికులు, చిన్న వ్యాపారుల రోజువారీ జీవితంలో భాగమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ)పై కొత్త వ్యాపారి రుసుము (ఎండీఆర్) విధానం తీసుకురావడం పనికి మాలిన చర్యఅని, డిజిటల్ విధానంతో క్యాష్ లెస్ పేరుతో యూస్ లెస్ పనులు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్ డిమాండ్ చేశారు.

భగత్‌సింగ్ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి
నవ తరంగాలు/హనుమకొండ : భగత్‌సింగ్ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి. సెప్టెంబర్ 27 నుండి 30 వరకు భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు.సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు షహీద్ భగత్‌సింగ్ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలని, సెప్టెంబర్ 27 నుండి 30 వరకు జరిగే భగత్‌సింగ్ 119వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏఐవైఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్ అధ్యక్షతన జరిగింది.

ఆర్టీసీ బస్సు మంజూరు చేయాలి
నవ తరంగాలు/ హనుమకొండ : హనుమకొండకు ఆర్టీసీ బస్సులు మంజూరు చేయాలి. మాదన్నపేట – నాగూర్లపల్లి - పర్శ నాయక్ తండా నారాయణ తండా – తిమ్మంపేట - లక్కినేపల్లి మీదుగా హనుమకొండకు రోజుకు రెండు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని కోరుతూ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన 16వ వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్. ప్రజల ప్రయాణ సౌకర్యం కోసంమే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేసినట్లు 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ తెలియజేశారు.
