Skip to main content
నవ తరంగాలుSearch
జిల్లా వార్తలుహనుమకొండ

సామాన్య ప్రజలపై మోయలేని భారాలు

నవ తరంగాలు / హనుమకొండ : క్యాష్ లెస్ పేరుతో యూస్ లెస్ పనులు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం. యూపిఐ ఛార్జీల పేరుతో సామాన్య ప్రజలపై మోయలేని భారాలు. ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం. దేశంలో సామాన్య ప్రజలు, యువత, విద్యార్థులు, కార్మికులు, చిన్న వ్యాపారుల రోజువారీ జీవితంలో భాగమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ)పై కొత్త వ్యాపారి రుసుము (ఎండీఆర్) విధానం తీసుకురావడం పనికి మాలిన చర్యఅని, డిజిటల్ విధానంతో క్యాష్ లెస్ పేరుతో యూస్ లెస్ పనులు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్ డిమాండ్ చేశారు.

By: DHARAVATH ASHOK · హనుమకొండ·2 min read
Share:
అశోక్ స్టాలిన్
అశోక్ స్టాలిన్

నవ తరంగాలు / హనుమకొండ : క్యాష్ లెస్ పేరుతో యూస్ లెస్ పనులు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం. యూపిఐ ఛార్జీల పేరుతో సామాన్య ప్రజలపై మోయలేని భారాలు. ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం. దేశంలో సామాన్య ప్రజలు, యువత, విద్యార్థులు, కార్మికులు, చిన్న వ్యాపారుల రోజువారీ జీవితంలో భాగమైన ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ)పై కొత్త వ్యాపారి రుసుము (ఎండీఆర్) విధానం తీసుకురావడం పనికి మాలిన చర్యఅని, డిజిటల్ విధానంతో క్యాష్ లెస్ పేరుతో యూస్ లెస్ పనులు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్ డిమాండ్ చేశారు. శనివారం ఏఐవైఎఫ్ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తా లోని బి ఆర్ భగవాన్ దాస్ విగ్రహం వద్ద "కేంద్ర ప్రభుత్వం యూపీఐ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని" డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్ హాజరై మాట్లాడుతూ క్యాష్ కి స్వస్తి పలికి ప్రజలందరూ డిజిటల్ చెల్లింపుల ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగించాలని పెద్ద ఎత్తున భారీ కటౌట్లతో మీడియాలో ప్రకటనల ద్వారా ప్రజలను మభ్యపెట్టిన మోడీ, యూపీఐ చెల్లింపుల ద్వారా ఎటువంటి చార్జీలు విధించమని ఆనాడు తెలిపారన్నారు. ఒక ప్రణాళిక బద్ధంగానే ముందు ఉచితంగానే సేవలు అందిస్తామని ఆ తర్వాత విపరీతమైన చార్జీలు వసూలు చేయడం సర్వసాధారణంగా మారిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం ₹2,000కు మించిన వ్యక్తి, వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం వ్యాపారి రుసుము, ₹75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలపై ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా ₹300 వరకు వర్తిస్తుందన్నారు. వ్యక్తి, వ్యక్తి లావాదేవీలు, ₹2,000 వరకు వ్యాపారి లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఈ కొత్త రుసుము విధానం వల్ల భవిష్యత్తులో చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న యువతపై పడే ఆర్థిక ప్రభావంపై స్పష్టమైన హామీ, పారదర్శకత అవసరమన్నారు. ప్రభుత్వం ప్రకారం మొత్తం వ్యాపారి లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కావని, అయినప్పటికీ మిగిలిన లావాదేవీలపై రుసుము విధించే విధానాన్ని ప్రజా ప్రయోజనాల కోణంలో సమీక్షించాలన్నారు. గడచిన 12 సంవత్సరాలుగా పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై అధిక భారాన్ని మోపారు. అదేవిధంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్ మాట్లాడుతూ ప్రజల డిజిటల్ చెల్లింపులు, ప్రజల ప్రయోజనాల కోసమే వుండాలన్నారు. రుసుముల భారానికి కాదు అనే నినాదంతో పారదర్శకమైన, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ చెల్లింపు వ్యవస్థ కోసం ప్రజా చర్చను ముందుకు తీసుకెళ్లాలని ఏఐవైఎఫ్ పిలుపునిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం యూపీఐపై కొత్త వ్యాపారి రుసుము విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మాజీ జిల్లా నాయకులు కంచెర్ల కుమారస్వామి, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యురాలు తాటికంటి మమత, హనుమకొండ జిల్లా ఆఫీస్ బేరర్స్ గుగులోత్ సురేష్, పసునూరి సునీల్, పల్లకొండ శ్రీకాంత్, పెనుకుల మధు, నాయకులు జెట్టి కృష్ణ, ఈర్ల లావణ్య, అల్లం శివ, శ్వేతా, కావ్య, తురుక శోభన్,రంజిత్, విజయ్, అరవింద్, కుమార్, రాజు, వెన్నల, కృష్ణవేణి, సరిత తదితరులు పాల్గొన్నారు.

Related news

యాకన్న రాథోడ్
జిల్లా వార్తలు

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

నవ తరంగాలు / హనుమకొండ : పాలకుర్తి గురుకులంలో విద్యార్థినులను కరిచిన ఎలుకలు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. USFI జనగామ జిల్లా కార్యదర్శి యాకన్న రాథోడ్ డిమాండ్.

కర్రే బిక్షపతి
జిల్లా వార్తలు

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి

నవ తరంగాలు/హనుమకొండ : భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి. సెప్టెంబర్ 27 నుండి 30 వరకు భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు.సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు షహీద్ భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలని, సెప్టెంబర్ 27 నుండి 30 వరకు జరిగే భగత్‌సింగ్‌ 119వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏఐవైఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్ అధ్యక్షతన జరిగింది.

ఆర్టీసీ రీజనల్ మేనేజర్
జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సు మంజూరు చేయాలి

నవ తరంగాలు/ హనుమకొండ : హనుమకొండకు ఆర్టీసీ బస్సులు మంజూరు చేయాలి. మాదన్నపేట – నాగూర్లపల్లి - పర్శ నాయక్ తండా నారాయణ తండా – తిమ్మంపేట - లక్కినేపల్లి మీదుగా హనుమకొండకు రోజుకు రెండు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని కోరుతూ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన 16వ వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్. ప్రజల ప్రయాణ సౌకర్యం కోసంమే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేసినట్లు 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ తెలియజేశారు.