Skip to main content
నవ తరంగాలుSearch
రాజకీయాలు

కాంగ్రెస్ సర్కార్ ను అసెంబ్లీలో ఎండగడతాం..

జీవో 97 పై కాంగ్రెస్ సర్కార్ ను అసెంబ్లీలో ఎండగడతాం జీవో 97ను రద్దు చేసే వరకు పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. - అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

By: BANDI MOGILI·1 min read·2 views
Share:
విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .
విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .

జీవో 97 పై కాంగ్రెస్ సర్కార్ ను అసెంబ్లీలో ఎండగడతాం

జీవో 97ను రద్దు చేసే వరకు పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది.

- అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .

పాలిటెక్నిక్ కళాశాలల ఆస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్ను. జీవో 97 వెనుక అసలు ఉద్దేశాన్ని బయటపెడతాం. పాలిటెక్నిక్ కళాశాలల విలువైన భూములు, ఆస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలలను లేబర్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు తీసుకొచ్చిన జీవో నంబర్ 97 వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అసెంబ్లీ వేదికగా ఎండగడతామని స్పష్టం చేశారు. జీవో 97ను రద్దు చేసే వరకు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు.

Related news