థియేటర్‌కు కేటీఆర్ రీజన్ అదేనంటగా
నవ తరంగాలు / హైదరాబాద్ : చాలా సంవత్సరాల తర్వాత థియేటర్ కి ఈరోజు వెళుతున్నాను అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు కేసీఆర్‌ను పోలిన పాత్రను సినిమాల్లో చూపించడం కెసిఆర్ స్టైల్ టాకింగ్ సినిమాలో చూపించడంతో బిఆర్ఎస్ శ్రేణులు కూడా ది పేరడైజ్ సినిమా చూసి సంబరపడిపోతున్నారు.

నవ తరంగాలు / హైదరాబాద్ : చాలా సంవత్సరాల తర్వాత థియేటర్ కి ఈరోజు వెళుతున్నాను అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు కేసీఆర్‌ను పోలిన పాత్రను సినిమాల్లో చూపించడం కెసిఆర్ స్టైల్ టాకింగ్ సినిమాలో చూపించడంతో బిఆర్ఎస్ శ్రేణులు కూడా ది పేరడైజ్ సినిమా చూసి సంబరపడిపోతున్నారు. ఇప్పటికే ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో క్లిప్స్ కేసీఆర్‌ను పోలి ఉన్న ప్రియదర్శి గెటప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే కేటీఆర్ ఈ సినిమాకు వెళ్లాలని భావించడానికి కారణం కూడా ఇదే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల నాని కాంబోలో విడుదలైన రెండో సినిమా ది పారడైజ్ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆధారణ తగ్గలేదు అందుకే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే కిక్కు వేరు కావడంతో కేటీఆర్ ది పారడైజ్ సినిమాకు వెళ్లాలని నిర్ణయించారు. 114 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా ది పారడైజ్ సినిమా కలెక్ట్ చేసిందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ది ప్యారడైజ్ సినిమా పిరియాడికల్ యాక్షన్ రామగా తెరకెక్కింది సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మాత మోహన్ బాబు రాఘవ్, డ్యూయల్ సంపూర్ణేష్ బాబు ఖయాదులోహార్ తనికెళ్ల భరణి సోనాలి కులకర్ణి కీలక పాత్ర పోషించారు అనిరుద్ సంగీతం అందించాడు. అయితే ఈ సినిమాను కేటీఆర్ చూసిన తర్వాత చేసే కామెంట్‌పై అంతట ఉత్కంఠట నెలకొన్నది.
