నిధుల వినియోగంపై కలెక్టర్ సమీక్ష
పీఎంశ్రీ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో పీఎంశ్రీ పాఠశాలల్లో నిధుల వినియోగంపై కలెక్టర్ సమీక్ష. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని 19 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ వరకు విడుదలైన నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు విడుదలైన నిధులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, వివిధ ఇంటర్వెన్షన్ల కింద చేపట్టిన పనుల వివరాలను ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

పీఎంశ్రీ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో పీఎంశ్రీ పాఠశాలల్లో నిధుల వినియోగంపై కలెక్టర్ సమీక్ష
జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని 19 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ వరకు విడుదలైన నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు విడుదలైన నిధులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, వివిధ ఇంటర్వెన్షన్ల కింద చేపట్టిన పనుల వివరాలను ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ పీఎం శ్రీ పాఠశాలల్లో ఆయా ఇంటర్వెన్షన్ల కింద కేటాయించిన నిధులను అభివృద్ధి పనులకు నిర్ణీత గడువులోగా వినియోగించాలన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడకూడా అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు.ప్రతి ఇంటర్వెన్షన్కు కేటాయించిన బడ్జెట్ను సరైన సమయంలో వినియోగించడంతో పాటు, చేపట్టిన పనులు, చేసిన ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదికలను సమర్పించాలని పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ మన్మోహన్, కమ్యూనిటీ మొబైలైజింగ్ కోఆర్డినేటర్ సుమాదేవి, లింగ సమానత్వ కోఆర్డినేటర్ సునీత, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Related news

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే విఘ్నేశ్వరుని అనుగ్రహంతో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకాంక్షించారు.

ఎగ్జామినేషన్ కేంద్రంను పరిశీలించిన కలెక్టర్
పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న జరగనున్న కంబైన్డ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కేంద్రంను పరిశీలించిన కలెక్టర్ ఈ నెల 13వ తేదీన( ఆదివారం) జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ -2 పరీక్ష నిర్వహణకు పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. బుధవారం హనుమకొండ వడ్డేపల్లి లోని పింగిళి ప్రభుత్వ బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను అక్టోబర్ 4వ తేదీన నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో హనుమకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి సంబంధించిన ఎన్నికల నిర్వహణ అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇతర అధికారులతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.
