Skip to main content

26 సెప్టెం

నవ తరంగాలు
జాతీయంహైదరాబాద్

నోటీసుల టెన్షన్ వద్దు.

సార్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆరోపణలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు కీలక సమావేశం నిర్వహించారు ఓటర్లకు ఇబ్బందులు లేకుండా నోటీసుల విచారణ డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియను సులభతనం చేయడంపై ఈ భేటీలో చర్చించారు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నోటీసుల పంపిణీ విచారణ దశ కొనసాగుతుంది

By: BANOTH VIJAYKUMAR·1 min read
Share:
జ్ఞానేశ్వర్ కుమార్
జ్ఞానేశ్వర్ కుమార్

నవ తరంగాలు / హనుమకొండ : బి ఎల్ వోలే ఓటర్ల ఇండ్లకు వస్తారు. బి ఎల్ వోలె డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తారు. విచరణ కోసం బిఎల్ఓ లను మీరు కలవాల్సిన అవసరం లేదు బిఎల్ఓలె మీ దగ్గరికి వస్తారు. సార్ ప్రక్రియ ఆరోపణలపై సిఇసి కీలక భేటీ. సార్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆరోపణలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా నోటీసుల విచారణ, డాక్యుమెంట్ల పరిశీలన, ప్రక్రియను సులభతనం చేయడంపై ఈ భేటీలో చర్చించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నోటీసుల పంపిణీ విచారణ దశ కొనసాగుతుంది. తెలంగాణ లోను బిఎల్వోలు ఓటర్లకు నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ నోటీసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బూత్ లెవెల్ ఆఫీసర్ లను కలవలసిన పనిలేదని వారే వచ్చి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి వారే అప్లోడ్ చేస్తారని ఈసీ పేర్కొన్నది.

లైవ్