Skip to main content
నవ తరంగాలుSearch
జిల్లా వార్తలుహనుమకొండ

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత శ్రీ లింగాల కేదారి, ఆయన భార్య దివంగత శ్రీమతి పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

By: DHARAVATH ASHOK · హనుమకొండ·1 min read
Share:
లింగాల కేదారి
లింగాల కేదారి

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత శ్రీ లింగాల కేదారి, ఆయన భార్య దివంగత శ్రీమతి పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత అంకితభావంతో అందించిన సేవలను ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకున్నారు. కేదారి దంపతులు ఒక సాధారణ హోటల్ నడుపుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, వృథా చేయకూడదని అవగాహన కల్పిస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకున్నారు. ఉద్యమ సమయంలో వీరు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీలు అందించారు. హనుమకొండలోని శాంతినగర్, పోస్టల్ కాలనీకి చెందిన లింగాల కేదారి 2026 సెప్టెంబర్ 9న, ఆయన భార్య పుష్పలత 2026 సెప్టెంబర్ 10న విషాదకర సంఘటనలో మృతి చెందారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి CMRF నుంచి సీఎం ఓఎస్డీ గారు రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. మంజూరైన ఆర్థిక సాయాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను ఆదేశించారు.

Related news

అదనపు కలెక్టర్ ఎన్ రవి
జిల్లా వార్తలు

కూడా పరిధిలో నీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి.హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష. కుడా పరిధిలో ఉన్న మండలాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
జిల్లా వార్తలు

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన కలెక్టర్

సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణి అర్జీలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి స్వీకరించారు. ప్రజల నుండి అందిన ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులను పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అక్కడికక్కడే ఆదేశించారు. అదేవిధంగా వర్చువల్ విధానంలో ఆర్డిఓ, తహసిల్దార్, ఎంపీడీవోలతో ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ మాట్లాడారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
జిల్లా వార్తలు

ఎంపీల్యాడ్స్ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం

ఎంపీల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఎంపీల్యాడ్స్ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం ఎంపీల్యాడ్స్ నిధులతో జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్ )ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.