అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు శంకుస్థాపన
నవ తరంగాలు / హన్మకొండ : రూ.1.43 కోట్లతో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు శంకుస్థాపన . వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పెద్దమ్మగడ్డ కాలనీకి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమ్మగడ్డ ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన ప్రాంతంగా ఉందన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారే తప్ప, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు.

ప్రజలకు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
సుమారు రూ.1.43 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండేలా, శాశ్వతంగా వైద్య సేవలు అందేలా సంబంధిత అధికారులతో ఇప్పటికే మాట్లాడినట్లు వెల్లడించారు.
పెద్దమ్మగడ్డ అభివృద్ధికి హెల్త్ సెంటర్‌తో పాటు రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు అంబేద్కర్ భవన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా పరిశీలించి, అందుకు అవసరమైన నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పెద్దమ్మగడ్డ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, , స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Related news

కూడా పరిధిలో నీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి.హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష. కుడా పరిధిలో ఉన్న మండలాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత శ్రీ లింగాల కేదారి, ఆయన భార్య దివంగత శ్రీమతి పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన కలెక్టర్
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణి అర్జీలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి స్వీకరించారు. ప్రజల నుండి అందిన ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులను పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అక్కడికక్కడే ఆదేశించారు. అదేవిధంగా వర్చువల్ విధానంలో ఆర్డిఓ, తహసిల్దార్, ఎంపీడీవోలతో ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ మాట్లాడారు.