Skip to main content
నవ తరంగాలుSearch
జిల్లా వార్తలుహనుమకొండ

ఎంపీల్యాడ్స్ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం

ఎంపీల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఎంపీల్యాడ్స్ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం ఎంపీల్యాడ్స్ నిధులతో జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్ )ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

By: BANOTH VIJAYKUMAR·1 min read
Share:
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

ఎంపీల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఎంపీల్యాడ్స్ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం. ఎంపీల్యాడ్స్ నిధులతో జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్ )ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, టీజీఐడీసీ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతి గురించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులలో పురోగతిలో ఉన్నవాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. మిగతా అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజుల్లో ఎంపీల్యాడ్స్ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ దేవిక చౌహాన్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గాయత్రి, పంచాయతీరాజ్ ఈఈ రాజగోపాల్ రావు, డీఈలు శ్రీనివాస రావు, శిరీష, యుగంధర్, రామ్ దేవ్, కన్సల్టెంట్ టెక్నీకల్ నరేందర్ రెడ్డి, టీజీఐడీసీ ఏఈ ఎండీ. అజీజ్ ఖాన్, పంచాయతీ రాజ్ ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related news

సిపిఐ మండల కార్యదర్శి
జిల్లా వార్తలు

గుండ్ల సింగారంలో మహా అన్నదాన కార్యక్రమం

హనుమకొండ/గుండ్ల సింగారం: అన్నదానం మహోన్నతమైన సేవా కార్యక్రమమని సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్ అన్నారు. శుక్రవారం గుండ్ల సింగారం సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లో ప్రతిష్టించిన విగ్నేషుడి విగ్రహం వద్ద జరిగిన మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, అతిధులుగా మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, నాయకులు పొనుగోటి రాముగోపాల్ చారి, మామునూరి దామోదర్ లు హాజరై భక్తులకు, ప్రజలకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి భాగస్వాములయ్యారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
జిల్లా వార్తలు

నిధుల వినియోగంపై కలెక్టర్ సమీక్ష

పీఎంశ్రీ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో పీఎంశ్రీ పాఠశాలల్లో నిధుల వినియోగంపై కలెక్టర్ సమీక్ష. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని 19 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ వరకు విడుదలైన నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు విడుదలైన నిధులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, వివిధ ఇంటర్వెన్షన్ల కింద చేపట్టిన పనుల వివరాలను ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
జిల్లా వార్తలు

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయి విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే విఘ్నేశ్వరుని అనుగ్రహంతో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌ పాయి ఆకాంక్షించారు.