గుండ్ల సింగారంలో మహా అన్నదాన కార్యక్రమం
హనుమకొండ/గుండ్ల సింగారం: అన్నదానం మహోన్నతమైన సేవా కార్యక్రమమని సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్ అన్నారు. శుక్రవారం గుండ్ల సింగారం సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లో ప్రతిష్టించిన విగ్నేషుడి విగ్రహం వద్ద జరిగిన మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, అతిధులుగా మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, నాయకులు పొనుగోటి రాముగోపాల్ చారి, మామునూరి దామోదర్ లు హాజరై భక్తులకు, ప్రజలకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి భాగస్వాములయ్యారు.

అన్నదానం మహోన్నతమైన సేవా కార్యక్రమం
సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్
గుండ్ల సింగారంలో మహా అన్నదాన కార్యక్రమం
హనుమకొండ/గుండ్ల సింగారం: అన్నదానం మహోన్నతమైన సేవా కార్యక్రమమని సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్ అన్నారు. శుక్రవారం గుండ్ల సింగారం సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లో ప్రతిష్టించిన విగ్నేషుడి విగ్రహం వద్ద జరిగిన మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, అతిధులుగా మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, నాయకులు పొనుగోటి రాముగోపాల్ చారి, మామునూరి దామోదర్ లు హాజరై భక్తులకు, ప్రజలకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్ మాట్లాడుతూ అన్నదానం మహోన్నతమైన సేవా కార్యక్రమమని, ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ఎంతో పుణ్యకార్యమని ఈ మహో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన తురక శోభన్ కుటుంబం ఎప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటుందని వారు పేర్కొన్నారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. అనంతరం అన్నదానం దాత తురక శోభన్ ను గణపతి కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, నాయకులు పొనుగోటి రాముగోపాల్ చారి, మామునూరి దామోదర్, గుంటీ రజిత, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తోట రామారావ, ఐదులపురం ప్రదీఫ్, లక్కం రాజు, రాపాల తిరుపతి, కళ్లేపల్లి రాజు, పట్టేం సరోజన, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Related news

నిధుల వినియోగంపై కలెక్టర్ సమీక్ష
పీఎంశ్రీ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో పీఎంశ్రీ పాఠశాలల్లో నిధుల వినియోగంపై కలెక్టర్ సమీక్ష. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని 19 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ వరకు విడుదలైన నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు విడుదలైన నిధులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, వివిధ ఇంటర్వెన్షన్ల కింద చేపట్టిన పనుల వివరాలను ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి విఘ్నాలను తొలగించి సకల శుభాలను ప్రసాదించే విఘ్నేశ్వరుని అనుగ్రహంతో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆకాంక్షించారు.

ఎగ్జామినేషన్ కేంద్రంను పరిశీలించిన కలెక్టర్
పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న జరగనున్న కంబైన్డ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కేంద్రంను పరిశీలించిన కలెక్టర్ ఈ నెల 13వ తేదీన( ఆదివారం) జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ -2 పరీక్ష నిర్వహణకు పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. బుధవారం హనుమకొండ వడ్డేపల్లి లోని పింగిళి ప్రభుత్వ బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
