Skip to main content
నవ తరంగాలుSearch
జిల్లా వార్తలుహనుమకొండ

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందుస్తుగానే సిద్ధం చేయాలి

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి జిల్లాలో రానున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందుస్తుగానే సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాలు, డిఆర్డిఏ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖ అధికారులతో కలిసి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పిఎసిఎస్ ల సీఈవోలు, ఏపీఎంలతో సమావేశాన్ని నిర్వహించారు.

By: DHARAVATH ASHOK · హనుమకొండ·1 min read·1 views
Share:
అదనపు కలెక్టర్ హనుమకొండ
అదనపు కలెక్టర్ హనుమకొండ

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి

జిల్లాలో రానున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందుస్తుగానే సిద్ధం చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాలు, డిఆర్డిఏ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖ అధికారులతో కలిసి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పిఎసిఎస్ ల సీఈవోలు, ఏపీఎంలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతులు, పరికరాలను సెప్టెంబర్ 25లోగా పూర్తిస్థాయిలో సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు , తేమ కొలిచే మీటర్లు, తదితర పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సన్నరకం ధాన్యం రకాలను గుర్తించి, వాటి కొనుగోలుపై సంబంధిత సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు. జీపీఎస్‌ అమర్చిన వాహనాల ద్వారానే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులు లేదా నిర్దేశిత గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దాన్యాన్ని సెంటర్ లోనే కొనేవిధంగా పర్యవేక్షించాలని, వాహనాల కదలికలను జిపిఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, సీఈవోలు, ఏపీఎంలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి మహేందర్, డిఆర్డివో మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, జిల్లా సహకార అధికారి మోహన్, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి అనురాధ, జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు , పిఎసిఎస్ ల సీఈవోలు, ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Related news

రెడ్ క్రాస్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం
జిల్లా వార్తలు

రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలను అక్టోబర్ 4వ తేదీన నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో హనుమకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి సంబంధించిన ఎన్నికల నిర్వహణ అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇతర అధికారులతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
జిల్లా వార్తలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ జిల్లా హసన్ పర్తి లోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్‌ బాజ్‌పాయి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.

వినతి పత్రాన్ని అందిస్తున్న బి.ఆర్ఎస్ నాయకులు
జిల్లా వార్తలు

ఇచ్చిన హామీలు అమలు చేయాలి

1000 రోజుల కాంగ్రెస్ వైఫల్య పాలనపై బీఆర్‌ఎస్ నేతల కన్నెర్ర. Dr BR.అంబేడ్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ద్వార నిరసన. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేకపోతే మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమం: రాష్ట్ర మాజీ జీసీసీ చెర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ & మండల BRS పార్టీ మాజీ అధ్యక్షుడు సిందే రామోజీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం కొడకండ్ల మండలం పాకాల మెయిన్ రోడ్డు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.