ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ జిల్లా హసన్ పర్తి లోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ జిల్లా హసన్ పర్తి లోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వ్యాక్సిన్ గది, ఆపరేషన్ థియేటర్, ఇన్‌పేషెంట్ గది, సిబ్బంది గది, నర్సుల గది, ఇంజక్షన్ రూమ్, ల్యాబొరేటరీ, ఫార్మసీ, టాయిలెట్స్, తదితర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులను కలిసి వారు ఏ సమస్యతో వైద్య సేవల కోసం వచ్చారో కలెక్టర్ ఆరా తీశారు. అక్కడ అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది స్పందన,తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వివరాలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలతో పాటు నిర్వహణ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించాలని వైద్యులు,సిబ్బందికి సూచించారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బంది అందుబాటులో ఉండేలా షిఫ్ట్‌ల వారీగా విధులు కేటాయించాలని, ప్రతి షిఫ్ట్‌లో అవసరమైన సిబ్బంది తప్పనిసరిగా విధుల్లో ఉండేలా పర్యవేక్షించాలని వైద్యాధికారిని ఆదేశించారు. హాస్పిటల్ నిర్వహణ పక్కాగా ఉండాలని. రోగులకు మెరుగైన వైద్యం, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కిరణ్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Related news

ఇచ్చిన హామీలు అమలు చేయాలి
1000 రోజుల కాంగ్రెస్ వైఫల్య పాలనపై బీఆర్‌ఎస్ నేతల కన్నెర్ర. Dr BR.అంబేడ్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ద్వార నిరసన. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేకపోతే మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమం: రాష్ట్ర మాజీ జీసీసీ చెర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ & మండల BRS పార్టీ మాజీ అధ్యక్షుడు సిందే రామోజీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం కొడకండ్ల మండలం పాకాల మెయిన్ రోడ్డు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్. హనుమకొండ జిల్లాకు సంబంధించి సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మంగళవారం అదనపు కలెక్టర్ ఎన్. రవి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.

యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు. యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి. హనుమకొండ గోపాల్ పూర్ లో అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.
