ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన కలెక్టర్
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణి అర్జీలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి స్వీకరించారు. ప్రజల నుండి అందిన ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులను పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అక్కడికక్కడే ఆదేశించారు. అదేవిధంగా వర్చువల్ విధానంలో ఆర్డిఓ, తహసిల్దార్, ఎంపీడీవోలతో ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ మాట్లాడారు.

ప్రజావాణి అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన కలెక్టర్
జిల్లా, రెవెన్యూ డివిజనల్, మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి 298 అర్జీలు
ప్రజావాణి అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజావాణి అర్జీలను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి స్వీకరించారు. ప్రజల నుండి అందిన ప్రజావాణి అర్జీలను సంబంధిత శాఖల అధికారులను పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అక్కడికక్కడే ఆదేశించారు. అదేవిధంగా వర్చువల్ విధానంలో ఆర్డిఓ, తహసిల్దార్, ఎంపీడీవోలతో ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ మాట్లాడారు.
వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రెవెన్యూ డివిజనల్, మండల స్థాయి లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 298 అర్జీలను సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ... ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుండి అందిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
ప్రజలు అందించిన అర్జీలు పెండింగ్ లో ఉండకుండా పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డిఆర్డివో మేన శీను, సీపీవో సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Related news

కూడా పరిధిలో నీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి.హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష. కుడా పరిధిలో ఉన్న మండలాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత శ్రీ లింగాల కేదారి, ఆయన భార్య దివంగత శ్రీమతి పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

ఎంపీల్యాడ్స్ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం
ఎంపీల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఎంపీల్యాడ్స్ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం ఎంపీల్యాడ్స్ నిధులతో జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీ లాడ్స్ )ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
