Skip to main content
నవ తరంగాలుSearch
రాజకీయాలుహైదరాబాద్

ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది

దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.

By: BANOTH VIJAYKUMAR·2 min read
Share:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం (SC/ST (Prevention of Atrocities) Act, 1989) అమలుపై ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2013 ఫిబ్రవరి 11న అనాటి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన చట్టం అమలుపై ఈ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మళ్లీ ఈ సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు, ఎంపీలు మల్లు రవి గారు, బలరాం నాయక్ గారు, కడియం కావ్య గారు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారు, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు గారు, మేడిపల్లి సత్యం గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, వేముల వీరేశం గారు, మందుల సామేల్ గారు, మట్టా రాగమయి గారు, వెడ్మ బొజ్జు గారు, మురళి నాయక్ గారు పాల్గొన్నారు.సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, డీజీపీ సీవీ ఆనంద్ గారు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య గారు, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు గారు, ఎస్సీ కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న సహాయం, పునరావాసంపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. చట్టంపై అవగాహన కార్యక్రమాలు, కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరును విశ్లేషించారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఎస్సీ ఎస్టీలపై అట్రాసిటీ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో ప్రధానంగా 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నివేదించారు. అక్కడ పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందని తెలిపారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇలాంటి ఘటనల్లో బాధితులకు సకాలంలో నష్టపరిహారం, సహాయ పునరావాసం అందేలా చూడాలన్నారు. బాధితులను ఆదుకోవడంలో బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్‌లో విడుదల చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ఇటీవల షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి, బాధిత కుటుబాలకు సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. సొంత తల్లిలా ప్రేమ చూపిన మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారిని ఆ వర్గాలు ఇప్పటికీ మరిచిపోలేదని పేర్కొంటూ, 25 లక్షల ఎకరాల భూములకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరాగాంధీ గారిదని అన్నారు. శ్రీమతి ఇందిరా గాంధీ గారి స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, బడ్జెట్‌లో జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 16 శాతం ఉంటే, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో 31 శాతం మంది లబ్ధిదారులు ఎస్సీలేనని, ఎస్టీ జనాభా 10 శాతం ఉంటే, వారికి 17 శాతం ఇండ్లను మంజూరు చేశామని వివరించారు. రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని, తద్వారా ఆ వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు మంచి భోజనం అందించగలుగుతున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు చదువు ఒక్కటే అందరి జీవితాలను మారుస్తుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు నొక్కిచెప్పారు. అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే సమస్యలు పరిష్కారం కావని గుర్తుచేశారు. పిల్లలను చదువు, క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు. దళితులు, గిరిజనులు,ఆదివాసీల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Related news

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాజకీయాలు

ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనులు జాప్యం జరుగుతుండటంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటలూ పనులు కొనసాగించాలని ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు ఇతర హాస్పిటల్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వరంగల్ హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తి చేయడంపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

అదనపు కలెక్టర్ ఎం రవి
రాజకీయాలు

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్
రాజకీయాలు

ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలి...

నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలి... రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల నిధులు విడుదల. ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల.. లబ్ధిదారులకు పరిహారం చేరేలా చర్యలు చేపట్టాలి. అవార్డులు జారీ చేసిన భూములకు పరిహారం చెల్లింపులు తక్షణమే పూర్తి చేయాలి. భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమించి, ప్రతి వారం పురోగతిపై సమీక్షించాలి. రైతులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం, మార్కెట్ విలువకు సమీపంగా పరిహారం అందించాలి. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రులు, సీఎస్. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.