Skip to main content
నవ తరంగాలుSearch
రాజకీయాలుహైదరాబాద్

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

By: BANOTH VIJAYKUMAR·2 min read
Share:
అదనపు కలెక్టర్ ఎం రవి
అదనపు కలెక్టర్ ఎం రవి

SIR–2026పై రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారంలో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని, వీటి పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. నోటీసులు జారీ చేయడంతో పాటు వాటిపై తదుపరి చర్యలు చేపట్టి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. చివరి నిమిషం వరకు ఫారం-6, 7, 8 దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ముందుగానే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ప్రతి బీఎల్‌ఓకు నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించి, వారి పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

అక్టోబర్ చివరి వారంలోగా అనామలీస్, ఇతర మ్యాపింగ్‌కు సంబంధించి ఓటర్లకు జారీ చేయాల్సిన నోటీసులు, వాటి పరిష్కార ప్రక్రియలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు.

ఎస్‌ఐఆర్–2026కు సంబంధించిన అన్ని పనులను 25-10-2026లోపు పూర్తి చేయాలని, చివరి 10 రోజులను చివరి క్షణంలో అవసరమయ్యే సవరణలు, ఇతర ప్రక్రియల కోసం కేటాయించుకోవాలని ఆదేశించారు.

ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఫారం-6తో పాటు అవసరమైన డిక్లరేషన్, సంబంధిత పత్రాలను సమర్పించేలా అర్హులైన ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఓటర్లకు జారీ చేసే నోటీసులను బీఎల్‌ఓలు మాత్రమే పంపిణీ చేయాలని, బీఎల్‌ఏలను నోటీసుల పంపిణీ ప్రక్రియలో పాల్గొననివ్వకూడదని స్పష్టం చేశారు.

అవసరమైన సందర్భాల్లో బీఎల్‌ఏలు ఇళ్లను గుర్తించడంలో సహకరించవచ్చని తెలిపారు. బీఎల్‌ఏ ద్వారా నోటీసులు పంపిణీ చేసినట్లు గుర్తిస్తే సంబంధిత బీఎల్‌ఓపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వయోవృద్ధులు, దివ్యాంగులు, విదేశాల్లో ఉన్న ఓటర్ల తరఫున వారి కుటుంబ సభ్యులు విచారణకు హాజరై సంబంధిత పత్రాలను సమర్పించవచ్చని తెలిపారు. ఈ విషయంపై బీఎల్‌ఓలు సంబంధిత ఓటర్లకు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించాలని సూచించారు.

బీఎల్‌ఓ స్థాయిలో ఐదు రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో అనర్హులుగా గుర్తించబడిన 99మందికి తగు కారణాలతో ఉత్తర్వులు జారీ చేయాలని సీఈవో సుదర్శన్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కు సూచన చేయగా దీనిపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ ఆదేశానుసారం ఉత్తర్వులు జారీ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related news

వీడియో కాన్ఫరెన్స్
రాజకీయాలు

ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలి...

నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలి... రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల నిధులు విడుదల. ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల.. లబ్ధిదారులకు పరిహారం చేరేలా చర్యలు చేపట్టాలి. అవార్డులు జారీ చేసిన భూములకు పరిహారం చెల్లింపులు తక్షణమే పూర్తి చేయాలి. భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమించి, ప్రతి వారం పురోగతిపై సమీక్షించాలి. రైతులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం, మార్కెట్ విలువకు సమీపంగా పరిహారం అందించాలి. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రులు, సీఎస్. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాజకీయాలు

యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలి

విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు.

బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చలకాని వెంకట్ యాదవ్
రాజకీయాలు

బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పోలు గ్రామానికి చెందిన న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్ పదవులకు హైదరాబాద్ లో ఎన్నిక నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోరులో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్ సమీప ప్రత్యర్థి పై మూడు ఓట్ల ఆదిక్యంతో వైస్ చైర్మన్ పదవిని చేజిక్కించుకున్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకని వెంకట్ యాదవ్ గెలుపు పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.