యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలి
విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు.

విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్ పిల్లలకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫాంను నెలాఖరులోగా అందజేస్తామని సమావేశంలో అధికారులు తెలియజేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు పంపిణీ పూర్తయిందన్నారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్లు పంపిణీ పూర్తయిందని అధికారులు వివరించారు. వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, ఇతర సామగ్రి విద్యార్థులకు అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా 10 శాతం విద్యార్థులు పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లు ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఈ ఏడాది అందించిన యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తి వ్యక్తమైందని అన్నారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Related news

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలి...
నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలి... రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల నిధులు విడుదల. ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల.. లబ్ధిదారులకు పరిహారం చేరేలా చర్యలు చేపట్టాలి. అవార్డులు జారీ చేసిన భూములకు పరిహారం చెల్లింపులు తక్షణమే పూర్తి చేయాలి. భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమించి, ప్రతి వారం పురోగతిపై సమీక్షించాలి. రైతులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం, మార్కెట్ విలువకు సమీపంగా పరిహారం అందించాలి. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రులు, సీఎస్. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పోలు గ్రామానికి చెందిన న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్ పదవులకు హైదరాబాద్ లో ఎన్నిక నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోరులో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్ సమీప ప్రత్యర్థి పై మూడు ఓట్ల ఆదిక్యంతో వైస్ చైర్మన్ పదవిని చేజిక్కించుకున్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకని వెంకట్ యాదవ్ గెలుపు పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
