భగత్‌సింగ్ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి
నవ తరంగాలు/హనుమకొండ : భగత్‌సింగ్ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి. సెప్టెంబర్ 27 నుండి 30 వరకు భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు.సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు షహీద్ భగత్‌సింగ్ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలని, సెప్టెంబర్ 27 నుండి 30 వరకు జరిగే భగత్‌సింగ్ 119వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏఐవైఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్ అధ్యక్షతన జరిగింది.

నవ తరంగాలు/హనుమకొండ : భగత్‌సింగ్ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలి. సెప్టెంబర్ 27 నుండి 30 వరకు భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు.సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులు షహీద్ భగత్‌సింగ్ స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలని, సెప్టెంబర్ 27 నుండి 30 వరకు జరిగే భగత్‌సింగ్ 119వ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏఐవైఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు నోముల కిశోర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, అతిధులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి మాట్లాడుతూ భగత్‌సింగ్ 1907 సెప్టెంబర్ 28న జన్మించారన్నారు. పన్నెండేళ్ళకే భారత జాతి విముక్తి కోసం ఉద్యమ ప్రయాణాన్ని అవపోసన పట్టి 14 ఏళ్లకే భారత స్వతంత్ర సంగ్రామంలోకి అడుగులేసి 23 ఏళ్లకే ఉరితాళ్లు ముద్దాడిన వేగుచుక్క అని అన్నారు. ధైర్యానికి దేశ భక్తికి ప్రతీకగా వీరత్వానికి మారుపేరుగా నవతరానికి భగత్ సింగ్ ఒక స్ఫూర్తిగా నిలిచాడని ఆయన పేర్కొన్నారు. భారత బానిస సంకెళ్ళు తెంచడం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ దృవతార షహిద్ భగత్ సింగ్ అని కొనియాడారు. భగత్‌సింగ్ తన జీవితకాలంలో రచనలు, జైలు లేఖలు, రాజకీయ ఆలోచనల ద్వారా యువతను సామాజిక మార్పు గురించి ఆలోచించేలా చేసిన వ్యక్తిగా చారిత్రక ఆధారాల్లో కనిపిస్తారన్నారు. భగత్‌సింగ్ పేరును కేవలం నినాదాల్లో కాకుండా ఆయన జీవితాన్ని, రచనలను, ఆలోచనలను చదవడం ద్వారా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటి యువత ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. ఆనాటి వారి త్యాగాలను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చరిత్రను వక్రీకరించుతున్నదని, విద్యను సైతం కాషాయీకరణ చేస్తూ అమరుల త్యాగాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నదని ద్వజమెత్తారు. మత చాందస వాద విధానాలు సామ్రాజ్య వాద దోపిడి పాలసీపై తిరుగుబాటు చేసేందుకు త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత అంతరాల వ్యవస్థను ధ్వంసం చేస్తూ సమాజ మార్పు కోసం ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. అదే విధంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చడంతో పాటు జయంతి, వర్థంతిలను అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, ఏఐవైఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ తాటికంటి మమత, గుగులోత్ సురేష్, పల్లకొండ శ్రీకాంత్, పెనుకుల మధు తదితరులు పాల్గొన్నారు.
Related news

ఆర్టీసీ బస్సు మంజూరు చేయాలి
నవ తరంగాలు/ హనుమకొండ : హనుమకొండకు ఆర్టీసీ బస్సులు మంజూరు చేయాలి. మాదన్నపేట – నాగూర్లపల్లి - పర్శ నాయక్ తండా నారాయణ తండా – తిమ్మంపేట - లక్కినేపల్లి మీదుగా హనుమకొండకు రోజుకు రెండు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని కోరుతూ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేసిన 16వ వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్. ప్రజల ప్రయాణ సౌకర్యం కోసంమే ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేసినట్లు 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ తెలియజేశారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నవ తరంగాలు / హనుమకొండ : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. చెరువులు, వాగులు, నాలాల్లో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి. హనుమకొండ కలెక్టరేట్ నుండి వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్ మీట్ ద్వారా జిల్లా కలెక్టర్ సమావేశం. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.

ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు
నవ తరంగాలు / హనుమకొండ :చిన్న వడ్డేపల్లి చెరువులో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు.
