Skip to main content
నవ తరంగాలుSearch
జిల్లా వార్తలుహనుమకొండ

ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు

నవ తరంగాలు / హనుమకొండ :చిన్న వడ్డేపల్లి చెరువులో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు.

By: BANDI MOGILI·1 min read
Share:
కూడా చైర్మన్, హనుమకొండ జిల్లా కలెక్టర్
కూడా చైర్మన్, హనుమకొండ జిల్లా కలెక్టర్

నవ తరంగాలు / హనుమకొండ :చిన్న వడ్డేపల్లి చెరువులో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు .గణనాథునికి ఘనంగా వీడ్కోలు. కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి. కొబ్బరికాయలు కొట్టి నిమజ్జన వేడుకలను ప్రారంభించిన కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న. వరంగల్‌లోని చిన్న వడ్డేపల్లి చెరువులో వినాయక నిమజ్జనోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత కొబ్బరికాయలు కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. భక్తులు తీసుకువచ్చిన గణపతి విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేశారు. క్రేన్ సహాయంతో కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, డీసీపీ కవిత చెరువులో ఏర్పాటు చేసిన నీటితెప్పలపై దిగి విగ్రహాలను స్వయం గా నిమజ్జనం చేయడంతో పాటు....నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి మాట్లాడుతూ... చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. చిన్న వడ్డేపల్లి చెరువుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2500 విగ్రహాలు నిమజ్జనానికి రానున్నాయని పేర్కొన్నారు. దీనితో పాటు కుడా పరిధిలో ఉన్న అన్నీ నిమజ్జన పాయింట్ ల వద్ద అధికారులు తగు ఏర్పాట్లు చేసారన్నారు. వినాయక నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు విధులు నిర్వహిస్తున్న పోలీస్, రెవిన్యూ, GWMC, కుడా,విద్యుత్, ఇరిగేషన్, మత్స్య శాఖ, ఆర్ అండ్ బి, ఫైర్ తదితర అన్నీ శాఖల అధికారులను కుడా చైర్ పర్సన్ అభినందించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణనాథుల విగ్రహాలను భక్తులు ప్రత్యేక పూజలు, భజనలు, కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా చిన్న వడ్డేపల్లి చెరువు వద్దకు తీసుకురాగా క్రేన్ల సహాయంతో ప్రత్యేకంగా తయారు చేసిన తెప్పల్లో చెరువు నీటిలో నిమజ్జనం చేశారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. నిమజ్జన ప్రాంతంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, తాగునీరు తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో గణనాథుడి నిమజ్జన వేడుకలను నిర్వహించుకునేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related news

అధికారుల సమావేశం
జిల్లా వార్తలు

అదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలి

ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతికి ప్ర‌తిరూపాలుగా ఉన్న కాక‌తీయ క‌ళాతోర‌ణం, రామ‌ప్ప ఆల‌యం, పిల్ల‌ల‌మ‌ర్రి దేవాల‌యం.. శిల్ప‌, వాస్తు క‌ళ‌ను ప‌రిశీలించి, అవి ప్ర‌తిబింబించేలా నిర్మాణాలు చేప‌ట్టాల‌ని సూచించారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
జిల్లా వార్తలు

అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు శంకుస్థాపన

నవ తరంగాలు / హన్మకొండ : రూ.1.43 కోట్లతో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు శంకుస్థాపన . వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పెద్దమ్మగడ్డ కాలనీకి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమ్మగడ్డ ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన ప్రాంతంగా ఉందన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారే తప్ప, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు.

అదనపు కలెక్టర్ ఎన్ రవి
జిల్లా వార్తలు

కూడా పరిధిలో నీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి.హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష. కుడా పరిధిలో ఉన్న మండలాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.