అదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలి
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం.. శిల్ప, వాస్తు కళను పరిశీలించి, అవి ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి దేవాలయం.. శిల్ప, వాస్తు కళను పరిశీలించి, అవి ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు నిర్మించే ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్రవాహం మార్పు, రహదారుల మళ్లింపు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగునీటి సరఫరా లైన్ల మార్పు అంశాలను అధికారులు ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు. ఆయా అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. విమానాశ్రయాల కాంపౌండ్ వాల్ సమీపం నుంచి రహదారులు నిర్మించాలని, ఆ రహదారులను సమీప జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని సూచించారు. ఏ శాఖకు ఆ శాఖ విడివిడిగా పనులు చేపడితే, అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. విద్యుత్, ఆర్ అండ్ బీ, తాగునీటి సరఫరా, నీటి పారుదల శాఖ అధికారులు సమావేశమై బీఎస్ఎన్ఎల్ అధికారులతో చర్చించి, ఏకకాలంలో పనులు సాగేలా చూడాలని సూచించారు. ప్రస్తుత అవసరాలనే కాకుండా భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని పనులు ముందుకు సాగేలా చూడాలని సూచించారు. వాగులు, ఇతర నీటి ప్రవాహాలను మళ్లించాల్సి వస్తే, విమానాశ్రయాల ప్రాంగణం లేదా సమీపంలో చెరువులను నిర్మించి, అక్కడి నుంచి ప్రవాహాలను మళ్లించేలా చూడాలని చెప్పారు. విమానాశ్రయాలకు వచ్చే, వెళ్లే రహదారులు విశాలంగా ఉండడంతో పాటు సమీపంలోని ముఖ్య రహదారులకు అనుసంధానించేలా ఉండాలని, నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలతో పాటు ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి గారు సమావేశంలో పరిశీలించారు. ప్రతి నిర్మాణంలోనూ తెలంగాణ సంస్కృతి, శిల్ప, వాస్తు కళలకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. పలు ఆకృతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు మార్పులను సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, విప్ బీర్ల ఐలయ్య గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారితో పాటు సంబంధిత ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Related news

అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు శంకుస్థాపన
నవ తరంగాలు / హన్మకొండ : రూ.1.43 కోట్లతో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు శంకుస్థాపన . వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పెద్దమ్మగడ్డ కాలనీకి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమ్మగడ్డ ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని వెనుకబడిన ప్రాంతంగా ఉందన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నారే తప్ప, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు.

కూడా పరిధిలో నీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి.హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో కుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష. కుడా పరిధిలో ఉన్న మండలాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కుడా పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత శ్రీ లింగాల కేదారి, ఆయన భార్య దివంగత శ్రీమతి పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.
