తక్షణమే సీఈసి పదవి నుండి తొలగించాలి
నవ తరంగాలు / హనుమకొండ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు. హనుమకొండలో సిపిఐ భారీ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా. ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే సీఈసి పదవి నుండి తొలగించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు.

నవ తరంగాలు / హనుమకొండ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు. హనుమకొండలో సిపిఐ భారీ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా. ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే సీఈసి పదవి నుండి తొలగించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఓటర్ల హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో, ధర్నాలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఒక పెద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు ప్రధాన వక్తగా మాట్లాడుతూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.అక్రమంగా తొలగించిన ఓటర్లందరి పేర్లను వెంటనే పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాలని కోరారు.ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల ఓటు హక్కును కాలరాస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.నిబంధనలకు విరుద్ధంగా ఓట్లను తొలగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.సీఈసిని పదవి నుండి తొలగించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జిల్లా నాయకులు ఎన్. అశోక్ స్టాలిన్, ఏదునూరి వెంకట్రాజం, కర్రె లక్ష్మణ్, జక్కు రాజు గౌడ్, నకీర్త ఓదెలు, వేల్పుల సారంగపాణి, కామెర వెంకటరమణ, గుంటి రాజేందర్, మాలోతు శంకర్ నాయక్, రాసమల్ల దీనా, కొట్టె వెంకటేశ్, మాలోతు మంగ, నోముల కిషోర్, గోకల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Related news

ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.

ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనులు జాప్యం జరుగుతుండటంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటలూ పనులు కొనసాగించాలని ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు ఇతర హాస్పిటల్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వరంగల్ హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తి చేయడంపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
