బాధ్యతలు స్వీకరించిన గుండు సుదారాణి
కుడా ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుదారాణి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు,జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

కుడా ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుదారాణి
పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు,జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
కుడా చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి అభినందనల వెల్లువ కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌పర్సన్‌గా గుండు సుదారాణి శనివారం బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండలోని కుడా కార్యాలయంలో నిర్వహించిన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగం గా....ఛాంబర్ లో అధికారికంగా కుడా ఛైర్ పర్సన్ గా గుండు సుధారాణి పదవీ బాధ్యతలు చేపట్టారు. వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్ పూర్, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కుడా వైస్ చైర్మన్/ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, తదితరుల సమక్షంలో కుడా ఛైర్ పర్సన్ గా గుండు సుధారాణి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చాలు, పూల మొక్కలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కుడా ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుండు సుదారాణి మాట్లాడుతూ... తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కుడా పరిధిలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్బంగా కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని నూతనంగా కుడా చైర్‌పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణికి అభినందనలు తెలిపారు.
Related news

యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు. యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి. హనుమకొండ గోపాల్ పూర్ లో అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.

ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే ప్రతి టీచర్ ఉత్తములే విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మారిన ప్రభుత్వ బడుల రూపురేఖలు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
తనను కుడా చైర్‌పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గుండు సుధారాణి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.