సెంట్రల్ హాల్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.
శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.

శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు గారి పేరుతో సెంట్రల్ హాల్‌గా నామకరణం చేసిన ఈ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి గారితో పాటు శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ శాసనసభ స్పీకర్ శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు గౌరవ సభ్యులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Related news

కాంగ్రెస్ సర్కార్ ను అసెంబ్లీలో ఎండగడతాం..
జీవో 97 పై కాంగ్రెస్ సర్కార్ ను అసెంబ్లీలో ఎండగడతాం జీవో 97ను రద్దు చేసే వరకు పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. - అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదం
ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది.

కొత్త సంక్షేమ పథకానికి ప్రభుత్వం శ్రీకారం
పేద కుటుంబాలకు ఆర్థిక చేయూతనిచ్చే కొత్త పథకాన్ని ప్రారంభించారు.