Skip to main content

10 అక్టో

నవ తరంగాలు

నిబంధనలు మరియు షరతులు

నవ తరంగాలు వెబ్‌సైట్ (www.navatarangalu.com), మొబైల్ యాప్ మరియు ఈ-పేపర్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరికీ — పాఠకులు, ప్రకటనదారులు మరియు సంస్థ సిబ్బంది అందరికీ — ఈ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని ఉపయోగించడం ద్వారా మీరు ఈ నిబంధనలను అంగీకరించినట్లే.

వెబ్‌సైట్ మరియు యాప్ వినియోగం

ఈ వేదికలను చట్టబద్ధమైన, వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి. సైట్ పనితీరుకు అంతరాయం కలిగించే, ఇతరుల హక్కులకు భంగం కలిగించే లేదా చట్టానికి విరుద్ధమైన ఏ చర్యకూ అనుమతి లేదు.

కంటెంట్ హక్కులు

ఇక్కడ ప్రచురించే వార్తలు, ఫొటోలు, వీడియోలు, ఈ-పేపర్ పేజీలు మరియు లోగోపై హక్కులు నవ తరంగాలు సంస్థకే చెందుతాయి. ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా వీటిని కాపీ చేయడం, తిరిగి ప్రచురించడం లేదా వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం నిషేధం. వార్త లింక్‌ను పంచుకోవడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు.

ప్రకటనలు

సైట్‌లో, యాప్‌లో కనిపించే ప్రకటనలకు మరియు వాటిలోని సమాచారానికి ఆ ప్రకటనదారులే బాధ్యులు. ప్రకటనల్లో పేర్కొన్న ఉత్పత్తులు, సేవలకు సంస్థ ఎలాంటి హామీ ఇవ్వదు.

ఇతర వెబ్‌సైట్ల లింకులు

మా వార్తల్లో ఇతర వెబ్‌సైట్ల లింకులు ఉండవచ్చు. ఆ సైట్ల కంటెంట్‌కు, వాటి గోప్యతా విధానాలకు మేము బాధ్యులం కాము.

సంస్థ సిబ్బంది

సంస్థలోని రిపోర్టర్లు, ఎడిటర్లు మరియు అడ్మిన్‌లు ఈ నిబంధనలతో పాటు తమ బాధ్యతలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలకు కూడా కట్టుబడి ఉండాలి. ప్రతిసారి లాగిన్ అయినప్పుడు వాటిని చదివి అంగీకరించాల్సి ఉంటుంది.

నిబంధనలలో మార్పులు

సంస్థ యొక్క పాలసీలు మరియు ఈ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మార్పులు ఈ పేజీలో ప్రచురించిన వెంటనే అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత కూడా ఈ వేదికలను ఉపయోగిస్తే మారిన నిబంధనలను అంగీకరించినట్లే.

వర్తించే చట్టం

ఈ నిబంధనలకు భారతదేశ చట్టాలు వర్తిస్తాయి. వీటికి సంబంధించిన ఏ వివాదమైనా తెలంగాణ రాష్ట్రంలోని సంబంధిత న్యాయస్థానాల పరిధిలోకి వస్తుంది.

సంప్రదించండి

ఈ నిబంధనలపై ఏవైనా సందేహాలు ఉంటే మాకు ఇమెయిల్ చేయండి: contact.navatarangalu@gmail.com

లైవ్