ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలి...
నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలి... రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల నిధులు విడుదల. ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల.. లబ్ధిదారులకు పరిహారం చేరేలా చర్యలు చేపట్టాలి. అవార్డులు జారీ చేసిన భూములకు పరిహారం చెల్లింపులు తక్షణమే పూర్తి చేయాలి. భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమించి, ప్రతి వారం పురోగతిపై సమీక్షించాలి. రైతులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం, మార్కెట్ విలువకు సమీపంగా పరిహారం అందించాలి. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రులు, సీఎస్. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలి... రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల నిధులు విడుదల. ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల.. లబ్ధిదారులకు పరిహారం చేరేలా చర్యలు చేపట్టాలి. అవార్డులు జారీ చేసిన భూములకు పరిహారం చెల్లింపులు తక్షణమే పూర్తి చేయాలి. భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమించి, ప్రతి వారం పురోగతిపై సమీక్షించాలి. రైతులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం, మార్కెట్ విలువకు సమీపంగా పరిహారం అందించాలి. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రులు, సీఎస్. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం–పునరావాస పునరుద్ధరణ (ఆర్‌అండ్‌ఆర్) పనుల పురోగతిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనులకు అవసరమైన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. నీటిపారుదల శాఖకు కేటాయించిన నిధులకు అదనంగా ఇతర వనరుల నుంచి నిధులను బదిలీ చేసి అవసరమైన మేరకు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో భూసేకరణకు మొత్తం రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.1,050 కోట్లు, మరోసారి రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,550 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
విడుదలైన నిధుల్లో అధిక భాగం ఇప్పటికీ అధికారుల ఖాతాల్లోనే ఉండి, లబ్ధిదారులకు చేరకపోవడం ఆందోళనకరమని అన్నారు.
జిల్లా కలెక్టర్లు భూసేకరణ లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. నిధులు సరిపోకపోయినా, ఇతర కారణాల వల్ల చెల్లింపులు సాధ్యం కాకపోయినా ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
విడుదలైన నిధులను అధికారుల వద్ద ఉంచి పనులను పెండింగ్‌లో పెట్టవద్దని స్పష్టం చేశారు.
భూసేకరణ పనులకు ప్రత్యేక అధికారులను నియమించి బాధ్యతలు అప్పగించాలని, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని పనులను పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు రెవెన్యూ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ భూసేకరణ పురోగతిని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇప్పటికే విడుదలైన రూ.2,550 కోట్లను పూర్తిగా వినియోగించిన అనంతరం అవసరాన్ని బట్టి అదనపు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
భూసేకరణ ప్రక్రియలో రైతుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు రైతులతో నేరుగా చర్చించి స్నేహపూర్వక వాతావరణంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ నిబంధనల ప్రకారం జరగాలని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పరిహారం మార్కెట్ విలువకు సాధ్యమైనంత సమీపంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి బడ్జెట్‌కు అదనంగా ఇతర వనరుల నుంచి నిధులు సమకూర్చి మంజూరు చేస్తున్నందున అధికారులు ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని భూసేకరణ పనులను పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయ్యేలోపు పెండ్లిపాకల రిజర్వాయర్ పనులు పూర్తయ్యేలా భూసేకరణను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
భూసేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే హైదరాబాద్‌లోని భూసేకరణ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇప్పటికే అవార్డులు జారీ చేసిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపులను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
అవార్డు జారీ చేసిన తరువాత కూడా చాలా కాలం పరిహారం అందకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, అధిక పరిహారం కోసం డిమాండ్లు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణపై ప్రతి వారం సమీక్ష నిర్వహించి, పనులను వేగవంతం చేయాలని సూచించారు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులకు సంబంధించి సుమారు రూ.3,100 కోట్ల విలువైన పనులు గుర్తించగా, రూ.2,514 కోట్ల మేర నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.
పరిహారం నేరుగా రైతులకు చేరేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో అధిక మొత్తంలో పరిహారం కోరుతున్న కారణంగా కొంత ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...
జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, ఇతర పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ రవి, ఆర్డీ వో వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Related news

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలి
విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు.

బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పోలు గ్రామానికి చెందిన న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్ పదవులకు హైదరాబాద్ లో ఎన్నిక నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోరులో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్ సమీప ప్రత్యర్థి పై మూడు ఓట్ల ఆదిక్యంతో వైస్ చైర్మన్ పదవిని చేజిక్కించుకున్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకని వెంకట్ యాదవ్ గెలుపు పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
