ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనులు జాప్యం జరుగుతుండటంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటలూ పనులు కొనసాగించాలని ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు ఇతర హాస్పిటల్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వరంగల్ హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తి చేయడంపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనులు జాప్యం జరుగుతుండటంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటలూ పనులు కొనసాగించాలని ఆదేశించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు ఇతర హాస్పిటల్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వరంగల్ హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తి చేయడంపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. పనులకు సంబంధించి షెడ్యూల్ తయారు చేసి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలని, ఇకనుంచి ప్రతిరోజూ ఆసుపత్రి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ గారిని ఆదేశించారు. భవన నిర్మాణం విషయంలో శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని, అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆసుపత్రి పరిసరాలు అహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా అవసరమైన విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. సనత్‌నగర్ ఎంసీఆర్ టిమ్స్ తరహాలో వరంగల్ ఆసుపత్రిలో కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. సనత్‌నగర్ టిమ్స్‌లో స్టాఫ్ క్వార్టర్స్‌ను నిర్మించాలని, అందుకు సంబంధించి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే హాస్పిటల్ నిర్వహణను ఏజెన్సీకి అప్పగించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారితో పాటు వైద్య ఆరోగ్య, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Related news

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి. అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలి...
నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలి... రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల నిధులు విడుదల. ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల.. లబ్ధిదారులకు పరిహారం చేరేలా చర్యలు చేపట్టాలి. అవార్డులు జారీ చేసిన భూములకు పరిహారం చెల్లింపులు తక్షణమే పూర్తి చేయాలి. భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమించి, ప్రతి వారం పురోగతిపై సమీక్షించాలి. రైతులతో సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం, మార్కెట్ విలువకు సమీపంగా పరిహారం అందించాలి. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రులు, సీఎస్. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలి
విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు.
