ఇచ్చిన హామీలు అమలు చేయాలి
1000 రోజుల కాంగ్రెస్ వైఫల్య పాలనపై బీఆర్ఎస్ నేతల కన్నెర్ర. Dr BR.అంబేడ్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ద్వార నిరసన. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేకపోతే మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమం: రాష్ట్ర మాజీ జీసీసీ చెర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ & మండల BRS పార్టీ మాజీ అధ్యక్షుడు సిందే రామోజీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం కొడకండ్ల మండలం పాకాల మెయిన్ రోడ్డు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

1000 రోజుల కాంగ్రెస్ వైఫల్య పాలనపై బీఆర్ఎస్ నేతల కన్నెర్ర. Dr BR.అంబేడ్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ద్వార నిరసన. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేకపోతే మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమం: రాష్ట్ర మాజీ జీసీసీ చెర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ & మండల BRS పార్టీ మాజీ అధ్యక్షుడు సిందే రామోజీ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం కొడకండ్ల మండలం పాకాల మెయిన్ రోడ్డు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు సిందె రామోజీ, అభిమాన్ గాంధీ నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 6 గ్యారెంటీలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు బలంతో బీఆర్ఎస్ ఉద్యమాన్ని అణచలేరు.నిన్న జరిగిన అసెంబ్లీ ముట్టడి సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తదితరుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును సిందె రామోజీ . గాంధీ నాయక్ లు తీవ్రంగా ఖండించారు.“ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై పోలీసు బలాన్ని ప్రయోగించడం అప్రజాస్వామికం. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించదగినది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలి.” అని ఆయన హెచ్చరించారు.“పోలీసు నిర్బంధాలు, కేసులతో బీఆర్ఎస్ పోరాటాన్ని ఆపలేరు. హామీల అమలులో ఇంకా జాప్యం చేస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతాం.” అని సిందె రామోజీ స్పష్టం చేశారు. గత ఏడు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమాలను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, సోషల్ మీడియా వారియర్స్, రైతులు, పార్టీ అభిమానులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఐక్యత, ఉత్సాహంతో భవిష్యత్ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్నవారు
ఎఫ్ఎస్సీఎస్ వైస్ చైర్మన్ మేటి సోమరాములు, మాజీ మార్కెట్ చైర్మన్ పేరం రాము, మాజీ మండల రైతు కో-ఆర్డినేటర్ దింకొండ వెంకటేశ్వర్ రావు, మండల బీఆర్ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్లు దుబ్బాక భాస్కర్ రెడ్డి, జెకుల విజయమ్మ–ప్రభాకర్, దేశగాని సతీష్ గౌడ్, గ్రామ ఇన్చార్జీలు బాకీ ప్రేమ్ కుమార్, చెంచు రాజిరెడ్డి, కుందూరు అమరేందర్ రెడ్డి, కటారి కృష్ణమూర్తి, లక్ష్మక్క పెల్లి, సర్పంచ్ పానమాటిట్టి పరశురాములు, మాజీ రైతు కో-ఆర్డినేటర్ పుస్కురి సంపత్ రావు, ఉపసర్పంచ్లు శ్రీను, యాదవ్, రహీమ్, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు సోమ్లా, నాయకులు ఎన్. సోమేశ్వర్ రావు, హరీష్, మంగ్యా, రణధీర్, శోభన్, శకర్, కొమురయ్య, శ్రీకాంత్, నరేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
Related news

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ జిల్లా హసన్ పర్తి లోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.

గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్. హనుమకొండ జిల్లాకు సంబంధించి సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మంగళవారం అదనపు కలెక్టర్ ఎన్. రవి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.

యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు. యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి. హనుమకొండ గోపాల్ పూర్ లో అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.
