గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్. హనుమకొండ జిల్లాకు సంబంధించి సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మంగళవారం అదనపు కలెక్టర్ ఎన్. రవి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
హనుమకొండ జిల్లాకు సంబంధించి సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మంగళవారం అదనపు కలెక్టర్ ఎన్. రవి, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు.
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపట్టే త్రైమాసిక తనిఖీలో భాగంగా గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత, స్ట్రాంగ్‌రూమ్‌ల పరిస్థితి, స్ట్రాంగ్ రూముకు వేసి ఉన్న సీళ్లను క్షుణ్ణంగా కలెక్టర్ పరిశీలించారు. భద్రతకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా నిరంతర నిఘా వ్యవస్థలో భాగంగా గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతా ప్రమాణాలు పకడ్బందీగా అమలుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.స్ట్రాంగ్‌రూమ్‌ల సీళ్లు, తాళాలు, ప్రవేశ–నిష్క్రమణ విధానం, సీసీ కెమెరాల నిఘా వంటి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా హనుమకొండ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ నుండి ఈ.వి. శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నుండి బి. ప్రవీణ్ కుమార్, బిజెపి నుండి నర్మెట శ్రీనివాస్, టిడిపి నుండి కుసుమ శ్యాంసుందర్, వైఎస్ఆర్సిపి నుండి నాగబెల్లి రజినీకాంత్, బీఎస్పీ నుండి అంబాల ప్రశాంత్, ఏఐఎంఐఎం నుండి సయ్యద్ ఫైజుల్లా, సిపిఎం నుండి జి. వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
Related news

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను అందించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ జిల్లా హసన్ పర్తి లోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.

ఇచ్చిన హామీలు అమలు చేయాలి
1000 రోజుల కాంగ్రెస్ వైఫల్య పాలనపై బీఆర్ఎస్ నేతల కన్నెర్ర. Dr BR.అంబేడ్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ద్వార నిరసన. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేకపోతే మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమం: రాష్ట్ర మాజీ జీసీసీ చెర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ & మండల BRS పార్టీ మాజీ అధ్యక్షుడు సిందే రామోజీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం కొడకండ్ల మండలం పాకాల మెయిన్ రోడ్డు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు. యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి. హనుమకొండ గోపాల్ పూర్ లో అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.
