Skip to main content
నవ తరంగాలుSearch
జిల్లా వార్తలుహనుమకొండ

రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు

తనను కుడా చైర్‌పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గుండు సుధారాణి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

By: DHARAVATH ASHOK·1 min read·5 views
Share:
గుండు సుధారాణి కూడా చైర్మన్
గుండు సుధారాణి కూడా చైర్మన్

కుడా చైర్‌పర్సన్‌గా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు

బీసీ మహిళలకు అత్యున్నత పదవులు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయం

వరంగల్, సెప్టెంబర్ 3:

తనను కుడా చైర్‌పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గుండు సుధారాణి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

బీసీల పక్షపాతిగా, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీ మహిళలకు అత్యంత కీలకమైన, ప్రధానమైన పదవులు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆమె పేర్కొన్నారు.

బీసీ మహిళలకు ఇంతటి ప్రాధాన్యత కలిగిన పదవులు అందించడం కేవలం పదవుల కల్పన మాత్రమే కాదని, బీసీ వర్గాలపై ముఖ్యమంత్రి గారికి ఉన్న నమ్మకానికి, మహిళల సామర్థ్యంపై ఆయనకున్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.

ఈ నిర్ణయం రాష్ట్రంలోని బీసీ మహిళల్లో నూతన ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తుపై భరోసాను కలిగించిందని తెలిపారు. బీసీ మహిళలు కూడా నాయకత్వం వహించగలరు, నిర్ణయాలు తీసుకోగలరు, సమాజానికి మార్గనిర్దేశం చేయగలరు అనే బలమైన సందేశాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చారని అన్నారు.

తనపై నమ్మకం ఉంచి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా, బీసీల అభ్యున్నతికి మరియు మహిళా సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేస్తానని గుండు సుధారాణి తెలిపారు.

బీసీల సంక్షేమం, మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు నా నియామకానికి సహకరించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, కాంగ్రేస్ అధినాయకులు సోనియాగాంధీ గారికి, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి, పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంకగాంధీ గారికి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, శాసనమండలి సభ్యులు బసవరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ కూడా చైర్మన్ హనుమకొండ జిల్లా డిసిసి అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ మరియు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నేతలు, నాయకులకు, కార్యకర్తలందరికీ గుండు సుధారాణి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

Related news

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
జిల్లా వార్తలు

యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి

వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు. యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి. హనుమకొండ గోపాల్ పూర్ లో అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
జిల్లా వార్తలు

ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే ప్రతి టీచర్ ఉత్తములే విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మారిన ప్రభుత్వ బడుల రూపురేఖలు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

గుండు సుధారాణి కూడా చైర్మన్
జిల్లా వార్తలు

బాధ్యతలు స్వీకరించిన గుండు సుదారాణి

కుడా ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుదారాణి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు,జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి