భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
నవ తరంగాలు / హాసన్ పర్తి : దేశంలో వికసిత భారత్ పేరుతో కేంద్ర పాలకవర్గాలు విభజిస్తూ విద్వేషాలను రగిలిస్తున్న కేంద్ర పాసిస్ట్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మతసామరస్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు.

మతసామరస్యాన్ని కాపాడుదాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం.
నేదునూరి జ్యోతి.
భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు.
నవ తరంగాలు / హాసన్ పర్తి : దేశంలో వికసిత భారత్ పేరుతో కేంద్ర పాలకవర్గాలు విభజిస్తూ విద్వేషాలను రగిలిస్తున్న కేంద్ర పాసిస్ట్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మతసామరస్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు శుక్రవారం రోజున హసన్ పర్తి మండల కేంద్రంలో సిపిఐ సీనియర్ నాయకులు మోతే లింగారెడ్డి తో కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మతసామరస్యత కాపాడాలని వినతిపత్రం సమర్పించడం జరిగినది. అనంతరం నేదునూరి జ్యోతి,మోతే లింగారెడ్డి మాట్లాడుతూ మతం ఆధారంగా సమాజంలో విభజన తీసుకువచ్చి లౌకివాదాన్ని భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ఫాసిస్టు పాలకులు అపహస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారతదేశం అన్ని మతాల విభిన్న భాషల ప్రాంతాల సామరస్యంతో సహజీవనం చేసే లౌకికవాద సమాజం అనే మౌలిక పునాదిని ఆర్ఎస్ఎస్,బిజెపి దెబ్బతీస్తుందన్నారు.నేడు దేశం మితవాదం, మతతత్వ ఫాసిజం అశ్రిత పెట్టుబడిదారీ విధానం అనుసరించే రాజకీయ శక్తులు రాజ్యాంగ మూల విలువలైన లౌకికవాదం, సంక్షేమవాదం,సమాఖ్య వాదాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయం గౌరవాన్ని హామీ ఇచ్చే వ్యవస్థ నిర్మాణం కొరకు సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నేదునూరి రాజమౌళి మండల కార్యదర్శి మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి దొమ్మాటి ప్రవీణ్ కుమార్ మాదాసి బాబు,ముజీగ పరుశరాములు, షేక్ బాబు,నాంపల్లి లక్ష్మయ్య, గోపరాజు కుమారస్వామి,ముజిగా అజయ్ కల్వచర్ల వెంకటేశ్వర్లు దుస్స వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Related news

మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ
మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్. నవ తరంగాలు / హనుమకొండ : కేంద్రంలోని బిజెపి పాలన విధానాలు దేశంలో మతసామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ ఆరోపించారు.

పెద్ది స్వప్న గారిని పరామర్శించిన అజ్మీర మంగ్య తండ సర్పంచ్
నవ తరంగాలు/ హన్మకొండ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు దివంగత నేత కీ. శే. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి మాజీ వరంగల్ జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గారిని ఈ రోజు హన్మకొండ లోని తమ స్వగృహమ్ నందు పరామర్శించిన అజ్మీర మంగ్య తండ సర్పంచ్ మాలోత్ వెంకట్, ఉపసర్పంచ్ అజ్మీర సుమన్ , ముంజాల కుంట గ్రామ సర్పంచ్ మోహన్, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్,మాజీ ఉపసర్పంచ్ మురళి, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు భూక్య రవినాయక్, వార్డు మెంబెర్ వెంకన్న, సీనియర్ నాయకులు కెసిఆర్ విరాభిమాని సపావట్ హట్టు నాయక్, మధు, యాకు,శ్రీను మరియు యువ నాయకులు సందీప్, సంతోష్, విజయ్, దేవేందర్ పాల్గొన్నారు

వినతిపత్రం అందజేత
నవ తరంగాలు / హైదరాబాద్ : గిరిజన రైతులకు న్యాయం చేయాలి. ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతిపత్రం అందజేత. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండా గ్రామానికి చెందిన గిరిజన. రైతుల భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ, నేడు హైదరాబాద్ లో నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారికి కలిసి వినతిపత్రం అందజేశారు.
Latest news
Most read
- 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
- 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
- 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
- 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
- 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
- 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
