మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ
మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్. నవ తరంగాలు / హనుమకొండ : కేంద్రంలోని బిజెపి పాలన విధానాలు దేశంలో మతసామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ ఆరోపించారు.

మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ.
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్.
నవ తరంగాలు / హనుమకొండ : కేంద్రంలోని బిజెపి పాలన విధానాలు దేశంలో మతసామరస్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ ఆరోపించారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో గల గాంధీ విగ్రహానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, సిపిఐ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ మాట్లాడుతూ గాంధీ అంటేనే మతసామరస్యానికి, పరమత సహనానికి ప్రతీక అని, అలా కోరుకున్నందుకే ఆర్ఎస్ఎస్ తుపాకి గుల్లకు బలి కావాల్సి వచ్చిందని అవేదన వ్యక్తం చేశారు. గాంధీని కాల్చిన గాడ్సేలే దేశభక్తులని, వారే మాకు స్ఫూర్తి అనే నిస్సిగ్గుగా కేంద్రంలో పాలన చేస్తున్న బీజేపీ పార్టీ చెబుతూ, మెజారిటీ వాద రాజకీయాలతో మైనార్టీలకు తావు లేకుండా చేసే ప్రయత్నాలు ఈ దేశంలో పెద్ద ఎత్తున మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. మత విద్వేషాలను నివారించడానికి గాందేయవాదులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్యవాదులు ఏకమై భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడానికి గాంధీజీ స్ఫూర్తితో ఉద్యమించాలని అదే మహాత్మునికి మనం అందించే ఘన నివాళులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మునిగాల బిక్షపతి, కాజీపేట మండల కార్యదర్శి మాలోత్ శంకర్ నాయక్, నాయకులు మునిగాల ఐలయ్య, రాస మల్ల కుమార్, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Related news

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
నవ తరంగాలు / హాసన్ పర్తి : దేశంలో వికసిత భారత్ పేరుతో కేంద్ర పాలకవర్గాలు విభజిస్తూ విద్వేషాలను రగిలిస్తున్న కేంద్ర పాసిస్ట్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మతసామరస్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పిలుపునిచ్చారు.

పెద్ది స్వప్న గారిని పరామర్శించిన అజ్మీర మంగ్య తండ సర్పంచ్
నవ తరంగాలు/ హన్మకొండ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు దివంగత నేత కీ. శే. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి మాజీ వరంగల్ జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గారిని ఈ రోజు హన్మకొండ లోని తమ స్వగృహమ్ నందు పరామర్శించిన అజ్మీర మంగ్య తండ సర్పంచ్ మాలోత్ వెంకట్, ఉపసర్పంచ్ అజ్మీర సుమన్ , ముంజాల కుంట గ్రామ సర్పంచ్ మోహన్, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్,మాజీ ఉపసర్పంచ్ మురళి, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు భూక్య రవినాయక్, వార్డు మెంబెర్ వెంకన్న, సీనియర్ నాయకులు కెసిఆర్ విరాభిమాని సపావట్ హట్టు నాయక్, మధు, యాకు,శ్రీను మరియు యువ నాయకులు సందీప్, సంతోష్, విజయ్, దేవేందర్ పాల్గొన్నారు

వినతిపత్రం అందజేత
నవ తరంగాలు / హైదరాబాద్ : గిరిజన రైతులకు న్యాయం చేయాలి. ఎస్టీ కమిషన్ సభ్యుడికి వినతిపత్రం అందజేత. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండా గ్రామానికి చెందిన గిరిజన. రైతుల భూ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ, నేడు హైదరాబాద్ లో నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ గారికి కలిసి వినతిపత్రం అందజేశారు.
Latest news
Most read
- 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
- 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
- 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
- 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
- 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
- 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
