ఘనంగా బతుకమ్మ సంబరాలు
నవ తరంగాలు / హనుమకొండ : తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండ మండలం గుండ్ల సింగారం గ్రామంలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్ కాలనీ లో గురువారం అత్యంత వైభవంగా ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఆట-పాట-మాట నిర్వహించడం జరిగింది.

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ.
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు.
సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
నవ తరంగాలు / హనుమకొండ : తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండ మండలం గుండ్ల సింగారం గ్రామంలోని సురవరం సుధాకర్ రెడ్డి నగర్ కాలనీ లో గురువారం అత్యంత వైభవంగా ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఆట-పాట-మాట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి మన సంస్కృతికి వారధి అయినటువంటి బతుకమ్మ పండుగను తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ అని కొనియాడారు. ప్రకృతి పరవశించే విధంగా భిన్న రకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆడే బతుకమ్మ ఎంతో విశిష్టతమైనదని అన్నారు. బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదని, మన ఆడపడుచుల ఆత్మీయతకు, తెలంగాణ ఆచారాలకు అందమైన వేడుక అని అన్నారు. అదే విధంగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి మాట్లాడుతూ మహిళ పెళ్ళికి తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీలు, వితంతువుల పెన్షన్లు రెట్టింపు, స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 50 శాతం మహిళలకు కేటాయింపు వాగ్దానాలను, గ్యారంటీలను బతుకమ్మ పండుగ సందర్భంగా వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, జిల్లా నాయకులు మాలోత్ శంకర్ నాయక్, మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాసమళ్ళ దీన, సిపిఐ నాయకులు పూజారి అమృతయ్య, కోడెపాక బాబు, మామునూరి దామోదర్, కేతపాక ప్రసాద్, మాలోత్ మంగ, తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు తాటికంటి మమత, రొంటాల శ్యామ్, తిప్పనపల్లి మోహన్, జెట్టి కృష్ణ, పెనుకుల మధు, కళ్యాణి, హేమలత, లావణ్య, శిరీష, పద్మ, సునీత, కవిత తదితరులు పాల్గొన్నారు.
Related news

పువ్వులను దేవతలుగా పూజించే పండుగ బతుకమ్మ
బతుకమ్మ సంబురాలు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన మహిళా ఉద్యోగినిలు పెద్ద సంఖ్యలో హాజరై తీరోక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో సందడి చేశారు.

డీఎస్ జగన్ కు ఘన సన్మానం
నవ తరంగాలు / హనుమకొండ : సమాచార ప్రసార శాఖ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ లను ఘనంగా సన్మానించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులు.

ఫోక్సో కేసు నమోదు చేయాలి.
హనుమకొండ పట్టణంలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలపై ఎల్ ఎఫ్ ఎల్ హెడ్మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసి వెంటనే విధులనుండి సస్పెండ్ చేయాలని TSF, TGVP విద్యార్థి సంఘాల నాయకులు కన్నం సునీల్, మేడారపు రంజిత్ కుమార్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజును కలిసి విద్యార్థి సంఘ నాయకులు వినతి పత్రం అందించినట్లు ఈ సంఘ బాధ్యులు కన్నం సునీల్ మేడారపు రంజిత్ కుమార్ తెలిపారు.
Latest news
Most read
- 1ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
- 2రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు
- 3యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
- 4ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
- 5బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా చలకాని వెంకట్ యాదవ్.
- 6రెడ్ క్రాస్ ఎన్నికల నిర్వహణపై అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశం
